నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో OP సేవలు, తాత్కాలిక OT సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు.
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్లు నిరవధిక సమ్మె ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూడ అద్యక్షులు చంద్రకాంత్ మాట్లాడుతూ.. ఇప్పటికే జూడ నేతృత్వంలో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని. నెలనెలా ఉపకార వేతనాలు చెల్లించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చే నెలనెలా ఉపకార వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఛానల్-స్టైపెండ్ల క్రమబద్ధీకరణపై G.O విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు వేయలని,ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) కోసం కొత్త భవనం నిర్మాణం చేపట్టాలనీ వారు పేర్కొన్నారు.
అలాగే వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన భద్రత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి నీ కోరారు.వివిధ ప్రభుత్వ కళాశాలల్లో కొత్త హాస్టళ్ల వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అందుకు వెంటనే ప్రభుత్వ చర్యలు తీసుకోనీ హాస్టల్ వసతులు కల్పించాలని సూచించారు.
అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు & రవాణ సేవలు అందించాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో AP విద్యార్థులకు 15% సీట్ల రిజర్వేషన్ల తొలగింపు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి నీ కోరారు.
సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్ లు సకాలంలో పరిష్కారం చేయాలనీ కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా జీజీహెచ్ జూనియర్ డాక్టర్ లు పాల్గొన్నారు.
