Thursday, April 16, 2026
HomeCRIMEమైనర్ బాలికపై అఘాయిత్యం!తోటి ఉద్యోగి అని నమ్మితే.. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఓ కామాంధుడు

మైనర్ బాలికపై అఘాయిత్యం!తోటి ఉద్యోగి అని నమ్మితే.. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఓ కామాంధుడు

మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.మాయమాటలతో వంచించి, బాలిక జీవితంతో చెలగాటమాడిన ఘటన నగరంలో కలకలం రేపింది.

ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు షాబాజ్‌ను ఒకటవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన షాబాజ్ నగరంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు.

అదే దుకాణంలో పని చేస్తున్న ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. తన మాటలతో ఆమెను నమ్మించిన నిందితుడు, పథకం ప్రకారం తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

జరిగిన దారుణాన్ని బాధితురాలు తన తల్లికి వివరించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఘటనపై తక్షణమే స్పందించిన ఎస్‌హెచ్‌ఓ రఘుపతి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!