ఇద్దరు ఎమ్మెల్యే లమధ్య మాటల యుద్ధం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.హుజారాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద శేరిలింగం పల్లి ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ వర్గీయులు గురువారం మూకుమ్మడిగా వెళ్లి రాళ్లు కోడిగుడ్లు టమాటా లతో దాడి చేసారు.
దాడి విషయం తెలిసి మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ ఇంటికి వెళ్లారు. బిఆర్ యస్ నుంచి ఎమ్మెల్యే గా గెల్చిన ఆర్కే పూడి గాంధీ పి ఏ సి చైర్మెన్ గా నియామకం కావడంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బుధవారం క్రితం తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.
బిఆర్ యస్ కు చెందిన గాంధీ ఇంటికి వెళ్ళి గులాబీ జెండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీనికి గాంధీ సైతం అంతే తీవ్రంగా స్పందించారు చెప్పిన టైమ్ కు రాకుంటే తానే కౌశిక్ ఇంటి కి వెళ్తానని గాంధీ తెగేసి చెప్పారు.
ఇద్దరు ఎమ్మెల్యే మధ్య సవాళ్ల తో ఇరుపక్షాల కార్యకర్తలు భారీఎత్తున మోహరించారు. దీనితో అప్రమత్తం అయిన పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యే లు బయటికి రాకుండా వారి ఇండ్ల వద్ద మోహరించారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి బయటికి రాకుండా కట్టడి చేశారు.
చెప్పినట్లుగానే గాంధీ ఆయన వర్గీయులను పురమాయించారు. వారంతా కౌశిక్ రెడ్డి కి మూకుమ్మడిగా వెళ్లి ఆయన ఇంటి మీద కోడిగుడ్లు టమాటా లు రాళ్లతో విరుచుక పడ్డారు.
మరో వైపు కౌశిక్ రెడ్డి వర్గీయులు సైతం ఎదురు దాడికి సిద్ధం అయ్యారు. పోలీసులు ఇరుపక్షాలను చెదరగొట్టారు.
