నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధిస్తూ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఉత్త్తర్వ్యూలు జారీ చేసారు .
ఉత్తర్వులను ఉల్లంఘించి నట్లయితే వారిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ 1348 ఫాస్లీ లోని సెక్షన్ & (76) ప్రకారం శిక్షకు అర్హులవుతారని ఆయన పేర్కొన్నారు ఈ ఉత్తర్వులు ఈనెల 11 న ఉదయం 6 గంటల నుండి ఈనెల 30 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని,
దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని కొందరు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్వేశ్వర్ దృష్టికి తెచ్చారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులవల్ల సాధారణ జనజీవనానికి తీవ్రఆటంకముకలుగుతుందనే చర్యలు తీసుకున్నారు .
వికృత మరియు అసభ్య ప్రవర్తన వలన పౌరులలో ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలలో భయాందోళన భావాన్ని కలిగిస్తుంది.
దీని ఫలితంగా నిజామాబాద్ కమీషనరేటు వీదుల్లో వారి స్వేచ్చా సంచారాన్ని నిరోధించడంప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా నిరోధించడానికి ఈ విషయంలో త్వరిత చర్యలు తీసుకోవడం అవసరమని భావించే నిషేధ ఉత్తర్వ్యూలు జారీచేసారు.
