నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఓ యువకుడు పై కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు.ఈ ఘటనా నగరంలోని రెండవ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని రెండవ ఠాణా పరిధిలోని నసీర్ హోటల్ చౌరస్తా ఎంఐఎం కార్యాలయం ఎదుట బైక్ మీద వెళ్తున్న మొహమ్మద్ జుమీద్ అనే వ్యక్తి పై ర్యాలీగా బయలుదేరిన కొందరు యువకులు దుర్భాషలాడుతూ , కర్రలతో దాడులకు తెగబడ్డారు.
దీంతో ఆ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన మొహమ్మద్ జుమీద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.