HomeCRIMEసైబర్ నేరలపై అవగాహన ముఖ్యం..ఏసిపి రాజా వెంకటరెడ్డి...

సైబర్ నేరలపై అవగాహన ముఖ్యం..ఏసిపి రాజా వెంకటరెడ్డి…

సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలు, సైబర్ నేరల పై వస్త్ర వ్యాపార మార్చేంట్ అసోసియేషన్ సభ్యులకు కి అవగాహనా సదస్సు నిర్వహించారు. గురువారం నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని వివిధ వస్త్ర వ్యాపారులతో,అలాగే గోల్డ్ షాప్ యజమానులతో అవగాహన కల్పించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగున్న దొంగతనాలు, సైబర్ నేరల పై జాగ్రత్తలు ఉండాలని సూచించారు.అలాగే ఫిసికల్ సెక్యూరిటీ గార్డు లను నియమించుకోవాలనీ తెలిపారు.

హై సెక్యూరిటీ లాక్ లను వాడాలి, బిజినెస్ సమయంలో తరువాత గోల్డ్ మరియు క్యాష్ సేఫర్ లో భద్రపర్చాలి, సేఫర్ లు ఎవరికీ కనిపించని ప్లేస్ లో పెట్టాలి, క్యాష్ ట్రాన్సక్షన్స్ ను తగ్గించి, డిజిటల్ ట్రాన్సక్షన్స్ మాత్రమే చేయాలనీ తెలిపారు. షాప్ లల్లో హై రిజల్లుషన్ సీసీటీవీ కెమెరాలు బిగించాలి, వాటిని క్లౌడ్ స్టోరేజ్ కి అనుసంధానం చేయాలను పేర్కొన్నారు. షాప్ లల్లో అలారం సిస్టం ని ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటిని పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేయాలి.

అలాగే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో పని వాళ్లకు ముందే ట్రయల్ చేపించాలి, సరి పడు గూర్కాలని నియమించి, తగు పెట్రోలింగ్ ని ఏర్పాటు చేయాలనీ సూచించారు. పానిక్ బటన్స్ ని ఏర్పాటు చేసుకొని అవసరం అయినప్పుడు ఉపయోగించాలి, క్యాష్, గోల్డ్ తరలించే వాహనాల కు GPS ట్రాకెర్స్ ను ఏర్పాటు చేయాలనీ తెలిపారు.

దొంగతనం, దొమ్మి, డామేజెస్ సెక్యూర్ కంప్రెహేన్సివే ఇన్సూరెన్సు కవరేజ్ చేపించాల సూచించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి,సిబ్బంది ,80 మంది వస్త్ర వ్యాపారులు, షాప్ యజమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments