HomeLaw and Orderనూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి...పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిదిరాల...

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి…పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిదిరాల రాణి….

నూతన చట్టాలపై పోలీస్‌ అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిదిరాల రాణి లు తెలిపారు.

శనివారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నరసయ్య ఆదేశాల మేరకు బోధన్ కోర్టు ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ శిక్షణలో పోలీసు అధికారులకు న్యూ క్రిమి నల్‌ లాస్‌(ఎన్‌సీఎల్‌)పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాక్ష్య అదినియం న్యాయం 2023 గురించి శ్యామ్ రావ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లుప్తంగా వివరించారు.

అదేవిధంగా ఈ శిక్షణలో భారతీయ న్యాయ సంహిత చట్టం,భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం గురించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిదిరాల రాణి క్లుప్తంగా వివరించారు.

ఈకార్యక్రమంలో బోధన్ ఎసిపిపి శ్రీనివాస్, బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ, బోధన్ రూరల్ సిఐ డి విజయ్ బాబు , రుద్రూర్ సిఐ కె జయేష్ రెడ్డి , ఎస్ఐ లు, ఫారెస్ట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments