నిజామాబాద్ నగరంలోని ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు..బోధన్ కు చెందిన గోసం గంగు,భర్త రాజు లు కలిసి పనులు నిమిత్తం నిజామాబాద్ కు వచ్చారు.
ఈ మేరకు నిజామాబాద్ నిఖిల్ సాయి హోటల్ ముందు రోడ్డు దాటే సమయంలో పులాంగ్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు మహిళను ఢీ కొనడంతో మహిళ బస్సు కింద పడినట్లు భర్త రాజు పేర్కొన్నారు. దీంతో మహిళ కు చిన్న గాయాలు అయ్యాయి.
అందుకు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మహిళకు గాయాలయ్యాయని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు బస్సు ముందు వాగ్దానాన్ని దిగారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
