హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా మాదిరి త్వరలో నిజామాబాద్ కూడా నిడ్రా ఏర్పాటు చేస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
శనివారం నగరంలోని ఓ హోటల్ లో విలేకరులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇది పిసిసి జిల్లా అని వెనుకబడిన జిల్లా అని అందుకు మంత్రులతో కలిసి మాట్లాడనని గుర్తు చేశారు.
తానూ ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుకొని పిసిసి అధ్యక్షుడు గా ఎదగడానికి పత్రిక రంగం సహకారం కూడా ఉందని ఆయన అన్నారు.
అలాగే నిజామాబాద్ జిల్లా లోని జర్నలిస్టు లకు కేటాయించిన భూములు, ఇళ్ల పరిష్కారం కోసం వెంటనే కలెక్టర్ తో మాట్లాడి జర్నలిస్టు లకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్యం,క్రీడల దిశగా అడుగులు వేస్తోందనీ ఆయన చెప్పారు.
అందుకు నిజామాబాద్ లో మహిళ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నర లక్షల రూపాయల అప్పు చేసిందన్నారు.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
నిజాంషుగర్ ఫ్యాక్టరీ నీ తెరిపించేందుకు మాత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అధ్యయనం కొనసాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాక్టరీని తెఇరిపిస్తామని చెప్పారు.
కొందరి అసమర్థత వల్ల నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో అవకాశం కలగలేదని విమర్శించారు. అందుకు తాము నిజామాబాద్ స్మార్ట్ సిటీ గా కావడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.అలాగే మంత్రి వర్గంలో జిల్లాకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.
