HomeTelanganaNizamabadపీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ - మల్యాల గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ అధికార...

పీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ – మల్యాల గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. —–

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో బహుజన సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు,

ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు, ఆనాడు వేళ్ళునుకొని ఉన్న మను వాదపు కుల వివక్షతను ఎదిరించి, పీడిత జనాన్ని ఏకం చేసిన మహా నాయకుడు అన్నారు, ఆయన చదువు, భారతదేశ స్థితి గతులను మార్చే రాజ్యాంగపు శక్తిగా అవతరించిందని అన్నారు,

కానీ ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు, రాజ్యాంగ పరిరక్షణ ఆయనకు అర్పించే ఘన నివాళి అన్నారు, ఈ కార్యక్రమంలో బహుజన సేవా సొసైటీ అధ్యక్షులు మారుతి, నాయకులు అలీ, ఇందిరమ్మ కమిటి సభ్యులు రమ, గోరేభాయ్, లావణ్య, గోపి, పర్వీన్, యశోద, తదితరులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments