బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు.వచ్చే లోకల్ బాడి ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చేలా గులాబీ పార్టీ వ్యూహ రచన చేస్తుంది.
ఇందులో భాగంగానే దిగ్గజ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ను రంగంలోకి దించింది. నిజామాబాద్ రూరల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఆయన మరోసారి బాన్స్ వాడ బరిలోకి అనివార్యంగా మారింది.
ఎలాగో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తనయుడు జగన్ గత అయిదేళ్లుగా పార్టీ క్యాడర్ లో పట్టు సాధించారు ప్రజల్లో ప్రాబల్యం పెంచుకున్నారు.
అందుకే బాజిరెడ్డి సైతం అధినేత ఆదేశాలతో బాన్స్ వాడ వైపు దృష్టి సారించారు గతంలో ఓ సారి ఎమ్మెల్యే గా పనిచేసారు దశాబ్ద కాలం పాటుక్రియాశీలకంగా పనిచేసారు. అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో సులువుగా పట్టు సాధించే అవకాశం వుందని పార్టీ పెద్దలు ఆశాబావం తో ఉన్నారు.
మొదటి ఎమ్మెల్సీ కవిత సైతం గోవర్ధన్ తో కలసి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు అప్పటి నుంచి గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇప్పుడు బాజిరెడ్డి ఎంట్రీ ఇవ్వబోతుండడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే భరోసా వ్యక్తం అవుతుంది.
నిజానికి బాన్స్ వాడ లో మొదటి నుంచి బిఆర్ యస్ కు మంచి పట్టు ఉంది. అందుకే కామారెడ్డి జిల్లాలో మిగితా మూడు నియోజకవర్గాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన బాన్స్ వాడ భారీ మెజార్టీ తో గెలిచారు.
కానీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఎమ్మెల్యే గా గెలిచిన పోచారం అధికారకాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మంత్రి గా స్పీకర్ గా ఆయన కొడుకు డీసీసీబీ అధ్యక్షుడి గా అవకాశం ఇచ్చినా పార్టీ వదిలేయడం ఫై విమర్శలు వెల్లువెత్తాయి అందుకే ఆయన వెంట క్రియాశీలకమైన క్యాడర్ కాంగ్రెస్ కు వెళ్ళలేదు.
మరో వైపు బిఆర్ యస్ అధిష్టానం సైతం చాల కాలం నియోజకవర్గం ను గాలికి వదిలేసింది. స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు సుప్రీం కోర్టు ఆదేశాల తో పోచారం సభ్యత్వం కోల్పోయే అవకాశాల నేపథ్యంలో గులాబీ బాస్ బాన్స్ వాడ మీద అర్జెంట్ గా ఫోకస్ పెట్టక తప్పలేదు.
అధికార పార్టీకి చెందిన దాదాపు ముప్పై మంది ద్వితీయ శ్రేణి నేతలు పోచారం తో వేగలేక బిఆర్ యస్ లో చేరడానికి సిద్ధం అయ్యారు వారంతా ఏనుగు వర్గీయులుగా ముద్ర ఉన్నవారే ! ఇదే అదనుగా భావించిన గులాబీ బాస్ వారందరి ని నేరుగా ఫామ్ హౌస్ కు రప్పించి గులాబీ కండువా కప్పేశారు.
వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం కు సానుకూలంగా ఉన్నారు ఈ మేరకు అదే విషయం వారంతా నేరుగా కేటీఆర్ కు సైతం చెప్పారు ఎందుకంటే పోచారం ను గతంలో ఓడించి ఖ్యాతి ఉన్న గోవర్ధన్ ను రంగంలోకి దించితేనే పార్టీ క్యాడర్ ఉత్సహం తో పనిచేసే అవకాశం వుందని అగ్ర నాయకత్వం భావిస్తుంది.
పూర్తీ స్థాయిలో తనకు ఇంకా బాధ్యతలు ఇవ్వక పోయినా బాజిరెడ్డి మాత్రం ఇప్పటికే తన కార్యాచరణ మొదలు పెట్టారు లోకల్ బడి ఎన్నికల్లో ఎవరెవరిని బరిలోకి దించాలో ఆయన స్కెచ్ వేస్తున్నారు ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్న నేతలను సైతం బిఆర్ యస్ లోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.
ఎన్నికలబరిలోకి దిగే వారికి అన్నీ తానై అండగా ఉంది గెలిపిస్తానని బాజిరెడ్డి ద్వితీయ శ్రేణి నేతలకు భరోసా ఇస్తున్నారు
