HomeEditorial Specialరణరంగంగా మారిన.. బాల్కొండ రాజకీయం - కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ - వేల్పూర్ వేదికగా అప్రమత్తం...

రణరంగంగా మారిన.. బాల్కొండ రాజకీయం – కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ – వేల్పూర్ వేదికగా అప్రమత్తం అయిన పోలీస్ శాఖ …….వేల్పూర్ ఏరియా లో ఆంక్షలు ……బహిరంగ సవాల్ – సిద్ధమవుతున్న ఇరు పార్టీల నేతలు – ఉద్రిక్తంగా మారిన రాజకీయ పరిణామం

రాష్ట్రమంతా ఒక రాజకీయం నడుస్తుంటే బాల్కొండ నియోజకవర్గంలో మరో రాజకీయ రణ రంగం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష టీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల కు వేల్పూర్ వేదిక గా మారింది.

ఇరు పార్టీల నేతలు పరస్పర సవాళ్లు విసురుకుంటూ నువ్వా.. నేనా.? అన్న చందంగా కయ్యానికి కాలు దూవ్వుతున్నారు. దీనితో పోలిసి శాఖ అప్రమత్తం అయింది. అవాంఛనీయ ఘటన లు తలెత్తకుండా కట్టడి చర్యలు సిద్ధం అయింది.గురువారం నుంచో వేల్పూర్ ఏరియా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

ఇటీవల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలోని రెంజర్ల ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాచిన అంశాన్ని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయగా, దానికి స్పందించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నియోజకవర్గంలోని సహకార సంఘాల నిర్వీర్యానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే.. వేముల ప్రశాంత్ రెడ్డి కారణమని పేర్కొంటూ, ఏకంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు.

అనంతరం ఇటీవల వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు సౌదీ అరేబియాలో మృతి చెందిన సందర్భంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, బాధితులకు పరిహారం చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

దీనికి స్పందించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఈ అంశంపై బహిరంగ చర్చకు తమ సిద్ధమని 17వ తేదీన చర్చకు రావడానికి ప్రశాంత్ రెడ్డి సిద్ధమంటు ప్రశ్నల వర్షం కురిపించాడు.

అంతేగాకుండా నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ బాట పట్టి మిగతా జీవులైన వారికి ప్రభుత్వం నుండి అందిన పరిహారం అందిన 55 లబ్ధిదారులను ఎత్తి చూపిస్తూ వారి పేర్ల జాబితా ను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విపరీతంగా టోల్ చేశారు.

దీంతో మేమేం తక్కువ అన్నట్టు టిఆర్ఎస్ కార్యకర్తలు రైతు రుణమాఫీ, రైతుబంధు రేషన్ కార్డులు తోపాటు వాళ్ళ సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని చూపిస్తూ బాధితులను నియోజకవర్గం బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా మీరు ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు తెలుస్తోంది.

ఒకవేళ బహిరంగ చర్చ జరిగితేఇటీవల కాలంలో భీంగల్ లో అప్పటి ఇంచార్జ్ జిల్లా మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఘటన మరోసారి రిపీట్ కానుందా అనే చర్చ జోరుగా కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments