నిజామాబాద్ నగరం లోని గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ సహకరించాలని బాసర జోన్ ఐ జి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం నగరంలోని ఒకటవ టౌన్ లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. మతాకల్లోహాలు సృష్టించే కొందరు రౌడీషీటర్లను బైండోవర్ చేసి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.
నిమర్జనానికి సంబంధించి అన్ని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి పీకేట్ లు కూడా వేశామని ఆయన తెలిపారు.
నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలకు కోసం పత్రిక ప్రకటనలు కూడా విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు.
నగరంలోని చిన్న విగ్రహాలు వినాయక బావిలో మరియు మద్యస్థం గా ఉండే విగ్రహాలను బాసరా గోదావరి నదిలో, అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను మాక్లూర్ మీదుగా నందిపేట్ వద్ద ఉన్న ఉమ్మెడ గోదావరి లో నిమర్జనాలు చేపట్టే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను, జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ లను, షీ టీం లను, మఫ్టీలో పోలీసు భద్రత సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.అందుకు సిసి నిఘా నేత్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.ముఖ్యంగా ఎలాంటి సౌండ్ సిస్టం కు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు.
డీజేలు పెట్టే గణేష్ మండలి సభ్యులు తగిన చర్యలు తీసుకొని నిమర్జనం నిర్వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఆటంకం కలగకుండా భారీ శబ్దాలు చేసే సౌండ్ సిస్టంలకు ఇలాంటి అనుమతి లేదని ఆయన హెచ్చరించారు.
ప్రజలు గణపతి నవరాత్రి సందర్భంగా ప్రశాంత వాతావరణంలో పోలీస్ సిబ్బందికి సహకారాలతో నిమర్జనాలు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్, ఏసిపి రాజా వెంకటరెడ్డి, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఒకటవ టౌన్ సిఐ విజయ్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.
