తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి
పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ అన్నారు సోమవారం హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ ఆవరణంలో ఆంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలల్లో ఆయన పాల్గొన్నారు పోలీస్ సిబ్బందితో కలిసి బతకమ్మ ఆడారు
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ, ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలుపాడారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) కోటేశ్వర రావ్, అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) శ్రీశంకర్ నాయక్, ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య, పోలీస్ కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
