తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో రాష్ట్ర స్థాయి ఉత్తమ డిపో మేనేజర్ గా అవార్డ్ పొందిన కమ్మర్ పల్లి మండల నాగపూర్ గ్రామ వాస్తవ్యులు నల్ల సాయన్న ను మండల అంబెడ్కర్ యువజన సంఘం ఘనంగా సన్మానించింది .
రైతు వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు *
ఈసందర్భంగా అంబెడ్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అవార్డ్ గ్రహీత సాయన్న నిజామాబాద్ జిల్లా లోని మారుమూల కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామం నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండి కష్టపడి చదివి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ డిపో మేనేజర్ గా అవార్డ్ పొందడం అందరికి గర్వకారణం,
అలాగే మృదు స్వభావి,స్నేహ శైలి సేవతత్పర్యులు,బహుజన వాదీ అయిన సాయన్న సర్ గారు TGS RTC సంస్థలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉత్తమమైన ,
నాణ్యమైన సేవలు అందించి నిజామాబాద్ 2 డిపో ను అన్ని రంగాలలో అగ్రగ్రామీగ నిలిపినందుకు గాను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎండి సజ్జనర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా అభినందనీయం
అని యువకులు అందరూ కూడా సాయన్న సర్ ని ఆదర్శంగా తీసుకుని పేదరికాన్ని సాకుగా తీసుకోకుండా మంచిగా చదువుకొని అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి ప్రయాణించాలని తెలిపారు.
*అలాగే రానున్న రోజుల్లో ఇంకా శాఖాపరంగా ఉన్నత పదవులు పొందాలని ,రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు పొందాలని కోరారు.అనంతరం సాంగ సభ్యులందరి సమక్షంలో పులమలతో శాలువా కప్పి మెమెంటో తో సత్కరించారు.
సన్మాన గ్రహీత నల్ల సాయన్న సర్ గారు మాట్లాడుతూ మండల అంబెడ్కర్ యువజన సంగం ఆధ్వర్యంలో నాకు రాష్ట్ర స్థాయి అవార్డ్ వచ్చిన సందర్భంగా ఇంత మంచి సన్మాన సభను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు మీరు ఆశించిన విదంగా ఇంకా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి మన మండలానికి గ్రామానికి మంచి పేరు తీసుకువస్తానని చెప్పారు,
అలాగే నేను స్థాయిలో ఉండడానికి కృషిచేసిన నా తల్లిదండ్రులకు ,స్నేహితులకు ,శ్రేయోభిలాషులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు..
ఈ కార్యక్రమంలో మండల అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్,గౌరవ అధ్యక్షుడు పాలేపు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సింగరి రాజేశ్వర్,కార్యదర్శి తెడ్డు రమేష్,ఎంపీటీసీ సుధాకర్,ఉప సర్పంచ్ చిన్న గంగారాం క్రియశిలా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీకాంత్,
గుర్రం నరేష్,కిరణ్ ,నరేంధర్, లెక్చరర్ సాయన్న,ఆంజనేయులు, క్రాంతి,గంగాధర్,విజయ్ ,బాబురావు,రాజు,వినయ్,అనిల్,రాజేశ్వర్ మురళి తదితరులు పాల్గొన్నారు
