HomeTelanganaNizamabadనిజామాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయండి ....షబ్బీర్ ను కోరినTGVP

నిజామాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయండి ….షబ్బీర్ ను కోరినTGVP

.నిజామాబాద్ జిల్లా కేంద్రం కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనితెలంగాణ విద్యార్థి పరిషద్ కోరింది

ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ని గురువారం కలిసి వినతి పత్రం ఇచ్చారు .

ఇందుకోసం పాలిటెక్నిక్ కళాశాల మైదానం లో భూమిని కేటాయించాలన్నారు ప్రభుత్వం ముందడుగు వేయాలని,జిల్లాలో ఇంజనీరింగ్ చదవాలి అనే కోరిక ఉన్న ,

బడుగు బలహీనర్గాల విద్యార్థులు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు వెచ్చించి పట్టణ ప్రాంతాలలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారని.

గత ప్రభుత్వం కూడా నిజామాబాద్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకుండా IT HUB పేరుతో హంగామా చేసి విద్యార్థులను అగం చేసిందని కావున కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బడుగు బలహీనర్గాలకు చెందిన విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలోని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చెయ్యాలని విన్నవించారుఅదనంగా, మహిళా డిగ్రీ కళాశాల,

ఫార్మసీ మరియు వెటర్నరీ కళాశాలల స్థాపనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, నిజామాబాద్ జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని,

ఆ హామీని నెరవేర్చాలని అభ్యర్థించారు.ఇలా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలి అని తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ గారు పేర్కొన్నారు.

విద్యార్థులకు స్థానికంగా ఉన్నత సాంకేతిక విద్యను అందించడంలో ఈ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తాయని, మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడానికి మహిళా డిగ్రీ కళాశాల అవసరం ఉందని తెలియజేశారు.

ఈ మేరకు షబ్బీర్ అలీ గారు TGVPవిజ్ఞప్తిని స్వీకరించి మెమోరాండం ని సీఎం ఆఫీస్కి పంపాలీనీ అధికారులకి ఆదేశించడం జరిగింది ప్రత్యేకంగా సీఎం గారితో చర్చిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో నగర అధ్యక్షులు అఖిల్ నాయకులు రవి ,వినయ్ ,సాయి ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments