ధన్ పాల్ లక్ష్మీబాయ్ &విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ నగర గణేష్ మండపాలకు ప్రతియేటా లాగే ఈసారి ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులకు ఆర్ధిక సహకారం అందించారు.
ఆర్థిక సహాయం కోసం వచ్చే భక్త బృందాలకు ఇబ్బంది కలుగకుండా ఎమ్మెల్యే ఈసారి పది కౌంటర్లు ఏర్పాటు చేసారు , గత సంవత్సరం దాదాపు ఏడు వందల మండపాలకు ఆర్థిక సహకారం ఇచ్చారు . ఈసారి రెండు రోజుల పాటు ఈ కతృవు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసారు.
గురువారం శుక్ర వారం ఈ రెండు రోజుల్లోనే ఆయా మండపాలకు చేయూత ఇవ్వనున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు హిందువులలో ఐక్యమత్యం పెంపొందించేదుకు ఆంగ్లేయుల
కాలంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు ప్రారంభించిన గణపతి నవరాత్రులు నేడు భారతదేశం నలు మూలలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చిన్న, పెద్ద అందరు కలిసికట్టుగా భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రులు జరుపుకుంటారని అన్నారు బలగంగాధర్ ను ఆదర్శంగా తీసుకొని ఇందూర్ నగరంలో గత పదేళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని తన ట్రస్ట్ ధ్వరా నిర్వహించడం
జరుగుతుందన్నారు,గణేష్ మండపాలకు సహకారం అందించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు, పర్యావరణ పరిరక్షణకు సాధ్యమైనంత వరకు మండపం నిర్వాహకులు మట్టి గణపతులు నెలబెట్టాలని సూచించారు నవరాత్రులు ముగిసే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు,
విగ్నేశ్వరుని ఆశీర్వాదం ప్రజలందరి పై ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ధన్ పాల్ లక్ష్మీ బాయ్ &విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


