భిక్కనూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ)గా జగడం నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సంపత్ కుమార్‌ను బదిలీ చేస్తూ, ఆయనను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
నరేష్ గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఆయన గతంలో సదాశివనగర్ ఎస్సైగా, బిచ్కుంద సీఐగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
అక్కడి నుంచి ఇప్పుడు భిక్కనూరు సీఐగా బదిలీపై రానున్నారు.త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
