నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా వి.భుజంగరావు నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు వెలువరించగా, శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ భుజంగరావును వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
