HomeTelanganaHyderabadకేటీఆర్ కు బిగ్ రిలీఫ్ ..... పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు...

కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ ….. పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు..అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశం..ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్ , ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశం..

మాజీ మంత్రి బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కు కేటీఆర్ బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన మీద మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.

సురేఖ చేసిన వ్యాఖ్యల ఫై కేటీఆర్ వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు . కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది.

భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు ఆదేశించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments