నిజామాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ భవన్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారి నేతృత్వంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుభాషావేత్తను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం పూర్వ జన్మ సుకృతం అని అన్నారు…1991 లో తను తీసుకున్న ఆర్ధిక పర విధానాలతోనే నేడు భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని అని అన్నారు…ఎల్పీజీ విధానంతో ఆర్ధిక సంక్షోభం నుండి భారత దేశాన్ని విముక్తి కలిగించిన ఆర్ధిక వేత్త పీవీ గారు అని అన్నారు…
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి రోష్ని జైస్వాల్,జిల్లా యూత్ ఇంచార్జి వినోద్,జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్దుల్ అద్నాన్,ఆదిత్య పాటిల్,రాజు గౌడ్ జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్,అసెంబ్లీల అధ్యక్షులు మహేందర్, మెయిన్ యూనిస్, మండలాల అధ్యక్షులు గైని కిరణ్,వినోద్,సోషల్ మీడియా కోఆర్డినేటర్లు లైన్ కిరణ్, లోక కృష్ణ తదితరులు పాల్గొన్నారు…
