అకస్మాత్తుగా ముంచెత్తిన వర్షంతో తరుముకొచ్చిన వరద నీటిలో చిక్కుక పోయిన వారిని వరద సహాయక బలగాలతో కలిసి కామారెడ్డి ఎస్పీ రక్షించారు.
కళ్యాణి వాగు పొంగి పొర్లడం తో పాటు నిజాం సాగర్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారి గా వరద నీరు అనేక గ్రామాలను ముంచెత్తింది.
అన్నాసాగర్ వద్ద వంతెన పనుల్లో ఉన్న పది మంది నివాసం ఉన్న ప్రాంతంలోకి భారీగా వరద నీరు నాలుగు వైపుల చుట్టేసింది దీనితో వారంతా అక్కడే ఉన్న వాటర్ ట్యాంకర్ మీదికి యెక్కి హాహాకారాలు చేసారు
దీనితో అధికారులు ఎస్డీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు కామారెడ్డి ఎస్పీ స్వయంగా వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.అలాగే గున్ కల్ శివారు లోని కోళ్ల ఫామ్ లో చిక్కుక పోయిన అయిదు గురిని సైతమ్ ఎస్డీఎఫ్ బలగాలను కాపాడాయి.
