– హైదరాబాద్‌లోని భవానీ నగర్‌లోని మొఘల్‌పురా లో ఆదివారం ఓ బైకు పేలిన ఘటన కలకలం రేపింది. భారీ శబ్దం తో పేలుడం స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు అస్లాం ఫంక్షన్ హాల్ సమీపంలో రహదారిపై ఈ ఘటన జరిగింది.
ఈ దుర్ఘటన లో 10 మంది గాయపడ్డారు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందిని సమాచారం. బైక్‌లోని ఫ్యూయల్ ట్యాంక్‌కు మంటలు అంటుకుని పగిలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
అయితే మొదట బైక్ మంటలు అంటుకోగానే బైక్ యజమాని తాపీగా మంటలు ఆర్పుతుండగా పేలుడు జరగడంతో ఎక్కవ మంది గాయపడ్డారు


