లోకసభ ఎన్నికల పోలింగ్ మరి కొద్దీ గంటలే గడువుంది. ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంది. కానీ అభ్యర్థులు ఎప్పటిలాగే ప్రలోభాలకు తెరలేపారు.
వోటర్ల కు నగదు ఇవ్వడం కన్న మద్యం మత్తులో ముంచడానికే ప్రాధాన్యత ఇచ్చారు.మద్యం ను ఏరులై పారిస్తున్నారు. అదే మత్తులో తముకు ఓటేయాలనేది ఎత్తుగడ గా ఉంది. కానీ మద్యం పంపిణీ అడ్డు కట్ట వేయడంలో ఎన్నికల నిర్వహణలో ఉన్న యంత్రాంగం చేతులు ఎత్తేసింది. మద్యం చెలామణి జరగకుండా కట్టడి చేశామని యంత్రాంగం బీరాలు పలుకుతుంది.
48 గంటల ముందే జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు మూసేసారు. పైకి చూడడానికి ఏ మద్యం దుకాణం చూసిన మూసే ఉంది. కానీ అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఎలాగో పోలీసు శాఖ ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉంది. కేవలం ఆబ్కారీ శాఖే రంగంలోకి దిగింది. కానీ మద్యం సిండికేట్ తో ఎలాగో మామూళ్ల బంధం పెనువేసుకొని వుండడం వల్ల మద్యం షాపు మూసే ఉన్న అమ్మకాలు మాత్రం బాహాటంగా సాగుతున్నాయి.
జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతాలలో సంగతి ఎలా ఉన్న ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులే కాదు ఎన్నికల నిర్వహణ లో కీలక అధికారులందరూ ఉండే జిల్లా కేంద్రంలో అభ్యర్తలకు అవసరమైనంత మద్యం సరఫరా జరుగుతుంది.
ఈసారి నగదు ఇవ్వడానికి ఆసక్తి చూపని అభ్యర్థులు మద్యం నే ఏరులుగా పారిస్తున్నారు. ముఖ్యంగా కుల సంఘాలకు శనివారం రాత్రి నుంచే యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్నారు. తమ పార్టీలో ఉండే ఆయా కులసంఘాల నేతలకే మద్యం బాధ్యతలు అప్పగించారు.
తమ కులం కు సంబంధించి ఏరియా లావారీగా సభ్యుల సంఖ్య మేరకు మద్యం బాటిళ్లు కేటాయిస్తున్నారు. సదురు నేతలు ఆయా కులసంఘాల నేతలను పిలుచుకొని కూపన్ లు ఇస్తున్నారు. మద్యం ఏ వైన్స్ లో తీసుకోవాలో ఎవరిని కలువలో చెప్తున్నారు. ఆదివారం రోజంతా మద్యం పంపిణీ ఓపెన్ గా సాగుతుంది