ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎసీపీ నారా యణ ఆధ్వర్యంలో ఎక్కువ శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
నగరంలో అధిక శబ్దాలు చేస్తున్న సుమారు 200 వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, వాహనదారులకు జరిమానాలు విధించి వాటిని రోడ్డు రోలర్ తో తొక్కించినట్లు తెలిపారు. పర్యావ రణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధన లను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. మైనర్లకు తల్లి దండ్రులు వాహనాలను ఇవ్వరాదన్నారు.
శబ్ద కాలుష్యం ఏర్పడితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామన్నారు.అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే జరిమానా విధించనున్నట్లు చెప్పారు. వరుసగా ట్రాపిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
వాహనానికి సంబంధించిన హారన్ సౌండ్, సైలెన్సర్ ఎలా ఉండాలని అని రీసెర్చ్ చేసిన తర్వాత కంపెనీలు బైక్‌లను తయారు చేస్తారన్నారు.
సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతున్నారని, రోడ్లపై వెళ్లే వారికి సౌండ్ పొల్యూషన్‌తో అనారోగ్యానికి గురవడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు ప్రసాద్,శేఖర్, ఎస్సై సుమన్, రహిమతుల్ల సిబ్బంది తదితరులున్నారు.
