HomeTelanganaNizamabadగణేష్ నిమజ్జనం డీజే పై నిషేధం ఎత్తివేయాలి..

గణేష్ నిమజ్జనం డీజే పై నిషేధం ఎత్తివేయాలి..

గణేష్ నిమజ్జనంలో డిజె సౌండ్ సిస్టంపై నిషేధం ఎత్తివేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన మహోత్సవాలు భక్తి ఆనంద వాతావరణంలో శాంతియుతంగా జరుగుతున్నాయనే తెలిపారు.

గతంలో శ్రీరామనవమి హనుమాన్ జయంతి తిరంగా యాత్ర వంటి ఉత్సవాలు కూడా ప్రశాంతంగాl ఎలాంటి అపశృతి లేకుండా జరిగిన విషయం తెలిసిందే అని అన్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో డీజే సౌండ్ సిస్టంపై విధించిన నిషేధం వల్ల గణపతి మండప నిర్వహకులు యువత భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతించబడిన పరిమిత డేసి బెల్స్ లో డీజే వినియోగం జరగడానికి అనుమతిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తవనీ ఆయన పేర్కొన్నారు.

అలాగే ఇప్పటికీ పోలీసు వారు సీజ్ చేసిన డీజే వాహనాలు సిస్టమ్స్ వెంటనే విడుదల చేయాలను కోరారు. నిమజ్జన సమయంలో గణపతి మండపాల వద్ద పోలీసులు భక్తులకు సంపూర్ణ సహకారం అందించాలనీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments