HomeTelanganaNizamabadరెవెన్యూ శాఖ ప్రక్షాళన కు కమిషనర్ కసరత్తులు ....వరుస ఏసీబీ దాడులతో దిద్దుబాటు ........వసూళ్ల దందా...

రెవెన్యూ శాఖ ప్రక్షాళన కు కమిషనర్ కసరత్తులు ….వరుస ఏసీబీ దాడులతో దిద్దుబాటు ……..వసూళ్ల దందా ఫై నిప్పులు చెరిగిన వైనం ……మరో అధికారి వసూళ్ల ఫై చివాట్లు ?

మున్సిపల్ కార్పొరేషన్ లో పూర్తిగా గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థ ను పూర్తీ స్థాయి ప్రక్షాళన కోసం కమిషనర్ ఎట్టకేలకు నడుంకట్టారు.

అవినీతి నిరోధక శాఖ వరుసగా రెవెన్యూ అధికారులనే టార్గెట్ చేస్తుండడంతో కమిషనర్ దిద్దుబాటు చర్యలకు సిద్ధం అవుతున్నారు ఆ విభాగంలో గత కొన్నేళ్లునుంచి యథేచ్ఛగా సాగుతున్న వసూళ్ల దందా లను నియంత్రించడానికి కార్యాచరణ ఖరారు చేసారు.

ఈ మేరకు గురువారం డిప్యూటీ కమిషనర్ తో కలిసి ఆ విభాగం తో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఖజానా ను పటిష్టం చేయాల్సిన రెవెన్యూ విభాగంలో వసూళ్ల ఎలా చేస్తుంది ఆయన కుండబద్దలు కొట్టేసారు.

ఆ విభాగంలో ఓ అధికారి వసూళ్ల కోసం వార్డు అధికారులకు టార్గెట్ లు పెట్టడాన్ని కూడా కమిషనర్ ప్రస్తావించారు. సదురు అధికారి వసూళ్ల గుట్టు చెప్తూ చివాట్లు పెట్టినట్టు సమాచారం.

నగర ప్రజల సేవలో అందరికి కన్న ముందుండే మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రతిష్ట కోల్పోతుందని ఆయన అవేదన వ్యక్తం చేసారు.

ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థ ను పూర్తీ స్థాయిలో పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు రాబోయే 15 రోజుల్లో గాడి పెట్టాలని స్పష్టం చేసారు. అసలు ఆస్తి పన్ను ఖరారు చేయడంలో నిబంధనల మేరకే పనిచేయాలని లేని పక్షంలో తానే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు.

రెవెన్యూ విభాగంలో వసూళ్ల దందా ఫై ఓ కన్నేయాలని డిసి ఆదేశించారు. నిజానికి ఈ విభాగంలో అధికారి వసూళ్ల దందా సర్వత్రా చర్చనీయాంశం అయింది సదురు అధికారి తన ఏరియా లో వార్డ్ అధికారులను వసూళ్ల కోసం రాచి రంపాన పెడుతున్నారు.

గతంలో ఈ వ్యవహారం తమ దృష్టి కి వచ్చినా ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా ఉండడం వల్లే అధికారి కాసుల కోసం బరితెగించే దాక వచ్చారు. కానీ ఏసీబి వరస దాడులతో వణికి పోయిన అధికారులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments