రేపు నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం బాసర , ఉమ్మడి బ్రిడ్జి , బోధన్ , బోర్గాం తదితర ప్రదేశాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అర్థరాత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా పరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రజలందరూ పోలీసులకు సహకారాన్ని అందించాలని , ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ నంబర్‌కు కాల్ చేయగలరు లేదా సమీప పోలీసులను సంప్రదించలన్నారు
ఈ పవిత్ర వేడుకను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు , సిఐలు , ఎస్సైలు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు
