HomeTelanganakamareddyరైతులకు అండగా ఉంటాం..--- బూరుగిద్ద మహిళా రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ .. వరద...

రైతులకు అండగా ఉంటాం..— బూరుగిద్ద మహిళా రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ .. వరద నష్టం ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించిన ముఖ్యమంత్రి..

భారీ వర్షాలకు పంటల నష్టానికి గురైన రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని, రైతులు అధైర్య పడవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులో ప్రధాన రహదారిపై కొట్టుకుపోయిన వంతెన వద్దకు చేరుకున్నారు. నష్టం పై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తో కలిసి తిలకించారు. తాత్కాలికంగా మరమతులు చేసిన బ్రిడ్జిని శాశ్వతంగా నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. . అక్కడినుంచి లింగంపేట్ మండలం బురిగిద్ద వద్దకు వెళ్లారు. నష్టపోయిన పంటలను సీఎం పరిశీలించారు. అక్కడే పలువురు మహిళా రైతులతో మాట్లాడారు. మహిళా రైతులు తమకు జరిగిన నష్టాన్ని, కోల్పోయిన పంటలను ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పంట నష్టం పై అంచనాలు రాగానే అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. 100 సంవత్సరాలలో రానంత వరద వచ్చిందన్నారు. రైతులు అధైర్య పడవద్దు అని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీ శాసనసభ్యులు మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూశారని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండేవాడే నాయకుడని, మీ ఎమ్మెల్యే అండగా ఉన్నారని కితాబ్ ఇచ్చారు. ఏ నాయకుడైనా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. 103 సంవత్సరాల పోచారం ప్రాజెక్టు వరదలు తట్టుకొని నిలబడిందని చెప్పారు. తాత్కాలిక మరవత్తు పనులు చేశామని, శాశ్వత పనులు చేపడుతామని వారికి హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఇసుకమేటలు తొలగించుకునేందుకు ప్రత్యేక నిధి ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments