బిక్కనూర్ మండలంలోని మల్లు పల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు నారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఈ నెల 24న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
నారాయణ భార్య లక్ష్మి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తోంది.
