సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దాదాపు వచ్చేసాయి. దేశప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న మోడీ సర్కార్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. దాదాపు 290 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం లో వుంటే ఇండియా కూటమి 230 స్థానాల్లో ఆధిక్యం లో ఉంది.
ఉత్తర్ ప్రదేశ్ ,రాజస్థాన్, మహారాష్ట్ర , బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. గతంలో పోల్చితే ఎన్డీయే దాదాపు 60 స్థానాలు కోల్పోతే ఇండియా కూటమి ఈసారి అదనంగా వంద స్థానాల ను గెలుస్తుంది. కనీసం మూడు వందల మార్క్ కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం వుందంటూ ఊదరగొట్టిన బీజేపీ కి మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోనే మొదటి రెండు రౌండ్ల లో వెనుకబడ్డారు.
కానీ ఏపీ ఒరిస్సా తెలంగాణ రాష్ట్రల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. దాదాపు 50 కి పైగా స్థానాలు సాధించింది. ముచ్చటగా మూడో సారి ప్రధాని కాబోతున్నారు.