సార్వత్రిక ఎన్నికల సమరం చివర దశలోకి చేరిన నేపథ్యంలో డిచ్పల్లి సిఎంసి వద్ద కొనసాగుతున్న కౌంటింగ్ సెంటర్ వద్ద ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
తొలుత బ్యాలెట్ ఓటింగ్ లో బిజెపి వైపు మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపారు. తర్వాత ప్రారంభమైన మొదటి రౌండ్ లో బి ఆర్ ఎస్ కు 6992 ఓట్లు పోలవగా, రెండవ రౌండ్లో 6444 ఓట్లు పోలయ్యాయి.
బిజెపి కాంగ్రెస్ పార్టీలు అత్యధిక మెజార్టీతో ఆదిత్యంలో ఉండగా వెనుకబడిపోయిన పోలింగ్ ఓట్లను చూసి నిరాశ పడిన పలువురు బిఆర్ కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుండి నిరాశతో బయటకు వెళ్ళిపోయారు.
ఎందుకు వెళ్తున్నారని మీడియా పాయింట్ వద్ద నిలబడిన పలువురు జర్నలిస్టులు వారిని ప్రశ్నిస్తే ఇంకేముంది అంటూ పెదవి విరుస్తూ మెల్లగా జారుకున్నారు.
