భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించండి
- యంపీ అరవింద్
- ఆర్మూర్ లో చాయ్ పే చర్చలో పాల్గొన్న అరవింద్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో యంపీ అరవింద్ చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. మామిడిపల్లి లోని మున్నురుకాపు సంగం లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతులు , గ్రామస్థులు పాల్గొన్నారు.. అనంతరం రైతుల సమస్యలు, గ్రామంలోని సమస్యలు ప్రజలను ఆడిగి తెలుసుకున్నారు… రైతులు సమస్యలు చెప్పగా జూన్ తర్వాత ప్రతిసమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు… అక్కడికి వచ్చిన యువకుడు వేసిన ప్రశ్నకు విజిల్ వేసి యువకుడిని అభినందించారు…తనను భారీ మెజారిటీ తో గెలిపించి.
నరేంద్ర మోడీ ని మరొకసారి ప్రధానిని చెయ్యాలని సూచించారు… BRS ప్రభుత్వం రైతులను ఏవిదంగానైతే పట్టించు కోలేదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లో జాప్యం చేస్తునందన్నారు…. వర్షాల పడి వడ్లు తడిసిపోతున్న పట్టించుకోవడం లేదన్నారు…. కాంగ్రెస్ పార్టీ 2లక్షల రుణ మాఫీ అన్నారు రైతులకిచ్చిన వాగ్ధానాలు, మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని అన్నారు…. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీలు 4 నెలలు గడుస్తూన్న అమలు చేయలేదని, కరెంట్ బిల్లులు ఒక నెల జీరో బిల్ కొట్టి ఈనెల కొట్టే బిల్లులో కొత్తబిల్లు, పాతది కలుపుకొని వస్తుందని హెద్దేవ చేశారు…
దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని అన్నారు… నీతి నిజాయితీ తో రోజు 18 గంటలు పని చేస్తున్న నరేంద్రమోడీని మరొకసారి గద్దెనిక్కించాలని కోరారు.




