నిజామాబాద్ శివారు లోని ఒడ్యాట్ పల్లి లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతి మహేష్ నవీన్ లు ముగ్గురు విద్యార్థులు గ్రామంలో చెరువు కు ఈత కోసం వెళ్లారు. ముగ్గురు ఓకే సారి చెరువులోకి వెళ్లారు.
చాల సేపటి దాక వారు ఇంటికి రాకపోవడంతో కుటింబీకులు ఆందోళన చెందారు. చెరువు వద్దకు వెళ్లి గాలించారు. దీనితో గ్రామానికి చెందిన గజ ఈతగాళ్ల రంగం లోకి దించారు. గల్లంతు అయిన విద్యార్థుల కోసం వారు చెరువులోనే గాలిస్తుక్రమంలో తిరుపతి ,మహేశ్, ల మృతదేహాలు లభ్యం కాగ నవీన్ కోసం గాలిస్తున్నారు