- ఆర్మూర్ ఎమ్మెల్యే పై హైకోర్టులో పిటిషన్
- హైకోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ
- అఫిడవిట్లో ఆస్తులు తక్కువ చేసి చూపెట్టారని పిటిషన్
-వేరువేరుగా పిటిషన్ వేసిన వినయ్ రెడ్డి , జీవన్ రెడ్డి లు
ఆర్మూర్ రాజకీయం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు హార్ట్ టాపిక్ గా నిలుస్తుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నిక ను సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటిషన్ ధాఖలు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డిలు వేరువేరుగా ఈ పిటిషన్ లు దాఖలు చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు .
ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులను తక్కువ చేసి చూపెట్టారని ఆధారాలతో సహా ఆరోపిస్తూ ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సమీప ప్రత్యర్థి అయిన వినయ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, మరోపక్క మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సైతం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తప్పుడు లెక్కలు చూపెట్టారంటూ హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని గోడౌన్ ను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదంటూ కోర్టు ను ఆశ్రయించారు సమీప రాజకీయ ప్రత్యర్థులు. . ఈ అఫిడవిట్ పై హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!
