నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధి లో శుక్రవారం అర్ద రాత్రి భారీ చోరీ జరిగింది. నగరంలోని కెసిఆర్ కాలనీ లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నిద్రపోతుండగా శుక్రవారం అర్ద రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ ఊచలు తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా లో దాచిన 2 లక్షల నగదు 28 తులాల నగలు ఎత్తుకెళ్లారు. బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు