తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బోధన్ డివిజన్‌లోని 11 మండలాల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా ప్రారంభమైంది.
తమ గ్రామ భవితవ్యాన్ని నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు, యువత పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ఉదయం 9 గంటల వరకు సగటున 19.80 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. 11 మండలాల్లో నమోదైన పోలింగ్ శాతంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. బోధన్ | 26.26% | | సాలూరు | 24.30% | రెంజల్ | 23.99%, | ఎడపల్లి | 20.48%, పోతంగల్ | 19.76%,వర్ని 19.62%,కోటగిరి 17.76%, నవీపేట 17.07%, చందూర్, 16.63%,మోస్రా 15.42%, రుద్రూర్ 10.38% ఓటింగ్ నమోదు అయింది. అలాగే అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
