Saturday, April 18, 2026
HomeCinemaబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గడికోటలో పర్యటన: మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలుబాలీవుడ్ నటి ప్రియాంక...

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గడికోటలో పర్యటన: మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలుబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

తెలంగాణలోని హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ మరియు దోమకొండ లోని గడికోటలో ప్రసిద్ధ గడికోట మహాదేవుని ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. పర్యటన సందర్భంగా ఆమె సోమసూత్ర శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఆలయంలోని హనుమాన్ ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేసి ఆధ్యాత్మికతను ఆస్వాదించారు.పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక, ప్రియాంక చోప్రా గడికోట పరిసరాల్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ముఖ్యంగా, గడికోట సమీపంలోని అద్దాల మేడ సహా పలు ప్రసిద్ధ ప్రదేశాలను ఆమె ఆసక్తిగా పరిశీలించారు.

ఈ పర్యటన స్థానిక ప్రజల్లో గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ప్రియాంక చోప్రాను చూడటానికి ఆలయం పరిసర ప్రాంతాల్లోని భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఆమె సాధారణ, నిష్కళంక ఆచరణ స్థానికులను మరింత ఆకర్షించింది.దోమకొండ లోని గడికోట మహాదేవుని ఆలయం చారిత్రక విశిష్టత కలిగినది కావడంతో, ఈ ప్రాంతానికి ప్రియాంక చోప్రా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!