ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 9 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన సదాశివనగర్ మండలంలోని యాచారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుమారుడు సంగెం అజిత్ (9 సంవత్సరాలు) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచారు. ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, దాని ఆధారంగా ట్రాక్టర్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని ఎస్సై పేర్కొన్నారు. పసివాడి మృతితో కుటుంబ సభ్యుల్లో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
