HomeCRIMEనగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి యత్నం...

నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి యత్నం…

నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి యత్నం…నిజామాబాద్ నగరంలోని గురువారం అర్ధరాత్రి తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు.పోలీస్ లు తెలిపిన కథనం ప్రకారం.

నిజామాబాద్ నగరంలోని సీతారాం నగర్ కాలానికి చెందిన వెంకటేశ్వర్లు గత 10 రోజులుగా కూతురు డెలివరీ నిమిత్తం అమెరికాకు వెళ్ళారు.

ఈ మేరకు అది గమనించిన దుండగులు గురువారం రాత్రి ఆ ఇంటికి వెళ్లి తాళం పగల గొట్టి ఇంట్లో కి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి ఎక్కడివి అక్కడ పడేశారు.ఇంట్లో ఏం లేకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి ఐదవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.

ఇంటి యజమాని అయిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments