రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి ఏర్గట్ల మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లాకు చెందిన శాంసన్(25).వృతి రీత్యా మేస్త్రి పనులు చేసుకుంటారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ఏర్గట్ల మండల కేంద్రలో నివసిస్తున్నారు .
సదరు శాంసన్ గురువారం ఏర్గట్ల మండలంలోని దొంచంద గ్రామ శివారు ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో శాంసన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
