పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా దోపిడీ లకు పాల్పడుతున్న దొంగల ముఠా పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద దాడి కి తెగబడ్డారు.
ఆత్మ రక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఎట్టకేలకు దొంగల ముఠా ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. రాజధాని హైదారాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుమీద తెల్లవారు జామున ఈ ఉందంతం జరిగింది. .
రహదారుల మీద పార్కింగ్ చేసిన వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ను పట్టుకోవడానికి నల్లగొండ సీసీఎస్ పోలీసులు గత కొద్దీ రోజులుగా గాలింపు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే నలుగురు సభ్యులున్న ముఠా కదలికలను గురువారం రాత్రి గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందం రంగంలో దిగింది. వారిని గుర్తించి వెంటబడింది. పోలీసుల ఛేజింగ్ ను పసిగట్టిన దొంగలు కొత్త పేట వద్ద ఎల్ బి నగర్ వైపు వెళ్తున్న ఓ వ్యాన్ లో ఓఆర్ఆర్ వైపు పారిపోయారు.
మరో వైపు రాచకొండ పోలీసులను సైతం అప్రమత్తం చేసి తమ ఛేజింగ్ కొనసాగించారు. కానీ వ్యాన్ పెద్ద అంబర్ పేట వద్ద మహిళా ప్రయాణికురాలు దిగాల్సి రావడంతో వ్యాన్ ఆపేసారు.
అదే సమయంలో పోలీసులు వచ్చి దొంగలను అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు కత్తులతో పోలీసుల మీదికి దాడికి తెగబడ్డారు.
దొంగల గ్యాంగ్ దాడికి తెగబడటంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో ఇద్దరిని దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆరుగురు సభ్యులున్న ఈ ముఠా పార్థి ముఠా కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు .