Tuesday, April 21, 2026
HomeCRIMEతాళం వేసిన ఇంట్లో చోరీ…

తాళం వేసిన ఇంట్లో చోరీ…

తాళం వేసి ఇంట్లో చోరీ జరిగిన ఘటన నగరంలోని 5వ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని బాబన్ సాహడ్ పహేడు కు చెందిన షేక్ అబ్బుత్ ఆలిక్.

అతని భార్య ముస్కాన్ బేగం మూడు రోజుల క్రితం వారి తల్లి గారి ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. ఈ మేరకు షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసుకొని గణపతి మండపం అలంకరణ కోసం వెళ్లినట్లు తెలిపారు.

తిరిగి ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉంది. దుండగులు ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారం, రూ 50 వేల నగదు అపహరించినట్లు పేర్కొన్నారు.

బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!