2025 చివరి నాటికి చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపిస్తాం.
.వచ్చేఏడాది చివరినాటికి బోధన్ మెట్ పల్లి లో ఉన్న. చక్కెర కర్మ గారాలను తెరిపించడానికి ప్రభుత్వం కట్టుబడి వుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కమిటీ కూడా ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. బిఆర్ఎస్ కవిత ఎంపి అరవింద్ నిజామాబాద్ కి ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు.ఎంపి అరవింద్ చివరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్మూర్ లో అంబేద్కర్ సాక్షిగా పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి. ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారని ఆయన మండిపడ్డారు. తిరిగి ఎన్నికలు సమీపించడంతో పసుపు బోర్డు.
ఏర్పాటు నాటకం అని ఆయన తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో. ఎంపి అరవింద్ నిజామాబాద్ ని ఎందుకు స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. అదే కరీంనగర్ ని నిజామాబాద్ తో పోలిస్తే వైశాల్యంలో గాని జనాభాలో గాని చిన్నగా ఉన్న కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేశారు అని ఆయన తెలిపారు. బోధన్ నుండి బీదర్ వరకు అలాగే నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి కాజీపేట వరకు రైల్వే లైన్లు ఎందుకు. తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు.
గత రాష్ట్ర ప్రభుత్వంలో నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉంటూ నిజామాబాద్లో సిటీ బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ఆయన అన్నారు. నిజామాబాద్ లో ఇంతవరకు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ గాని ఉమెన్స్ కాలేజ్ గాని. అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ఆయన అడిగారు.
ఆగస్టు 15 నాటికి నిజామాబాద్ నగరంలో సిటీ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తూ వచ్చాను. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా.
నన్ను ఆశీర్వదించండి. నిజామాబాదులో ఉమెన్స్ కాలేజ్, నిజామాబాద్ ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. డిసిసి అధ్యక్షుడు మోహన్ ,రెడ్డి , కేశ వేణు ,ఉర్దూ అకాడమీ చైర్మన్.తాహెర్ లు పాల్గొన్నారు

