లోకసభ ఎన్నికల కు సంబంధించి ప్రచార పక్రియ చివరి అంకానికి చేరింది. ప్రచారానికి సుమారు వారం రోజుల గడువే ఉంది. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలకు మరింత పదను పెట్టాయి.
ఇప్పటిదాకా ప్రచార బాధ్యతలు అభ్యర్థులే తమ బుజాల మీద మోస్తూ వచ్చారు. ఇక అగ్ర నేతల ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది.
చివరి వారం రోజుల్లో బడా నేతలు వస్తేనే క్షేత్ర స్థాయిలో సమీకరణాలు కచ్చితంగ మారుతాయని అభ్యర్థులు ధీమాతో ఉన్నారు.
వారి పర్యటనలు సూపర్ హిట్ అవుతే ప్రజల్లో మరింత సానుకూలత వచ్చే అవకాశం వుందని అదే టాక్ తమను గెలుపు తీరాలకు చేర్చుతుందనే భరోసా తో ఉన్నారు.
అందుకే అగ్ర నేతల పర్యటనల్లో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అభ్యర్థులు జాగ్రత్తలు పడుతున్నారు.
ముఖ్యంగా జనసమీకరణలో ఎంత ఖర్చైనా భరించే కార్యాచరణలో అభ్యర్థులున్నారు. నిజామాబాద్ లోకసభ స్థానం ఎలాగైనా గెలుస్తామని ధీమాలో ఉన్న బీజేపీ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది.
చివరి అస్రంగా ప్రధాని మోడీ జిల్లాకు వస్తారని భావించారు. కానీ ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదు కానీ హోం మంత్రి అమిత్ షా ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది.
ఆదివారం జిల్లా కేంద్రంలో గిరిరాజు మైదానం లో భారీబహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభ కు నిజామాబాద్ జగిత్యాల్ జిల్లాల నుంచి ప్రజలను తరలించే పనిలో బీజేపీ ఉంది.
మరో వైపు సోమవారం బిఆర్ యస్ అధినేత కెసిఆర్ జిల్లాకు ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన రోజంతా జిల్లాలోనే ఉండేలా షెడ్యూల్ ఖరారు అయింది.ప్రచారంలో దూకెళ్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఫై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆయా నియోజవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు సాగుతున్నాయి.
సోమవారం అధినేత కెసిఆర్ బస్సు యాత్ర తో ప్రజల్లో మరింత సానుకూలత వచ్చే అవకాశం ఉండనే అంచనాలో గులాబీ శ్రేణులున్నాయి.
అందుకే బస్సు యాత్ర సూపర్ హీట్ అయ్యేలా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు కార్యక్షేత్రంలోకి దిగారు. కెసిఆర్ సభ కు భారీఎత్తున ప్రజలను తరలించే బాధ్యతలను ఆయా సెగ్మెంట్ ల మాజీ ఎమ్మెల్యే లకు అప్పగించారు.