సొంత పొలం లోనే నిప్పంటుకొని ఓ రైతు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ధ వాల్గోట్ గ్రామానికి చెందిన శంకర్ (58) ఇటీవల వరి పంట ను మిషన్ తో కోయించాడు.
ఆ భూమి వానాకాలం పంటలు వేసుకోవడానికి అనువుగా ఉండేలా దున్నేయడానికిముందు వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు.
ఇది ప్రతియేటా జరిగే ప్రక్రియే ఇందులో భాగంగానే శంకర్ శుక్రవారం పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు.
తీవ్రమైన ఎండలు ఉండడంతో దీనితో ఒక్కసారి దట్టమైన మంటలు ఎగిసి పడ్డాయి అ మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు
