చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ మెడలో నుంచి బంగారు గొలుసు మాయం అయింది. ఒకటో టౌన్ పోలీసుల కథనం ప్రకారం. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి చెందిన అంజలి 7 నెలల గర్భవతి.
రొటీన్ చెకప్ కోసం అయిదు రోజుల క్రితం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి వచ్చింది చేరింది. ప్రస్తుతి వార్డు లో చేరిన ఆమె మెడలో నుంచి బుధవారం రాత్రి బంగారు గొలుసు మాయం అయింది .
ఉదయం లేచి చూసిన అంజలి తన మెడలోని బంగారు గొలుసు లేక పోవడంతో అదే వార్డు లో ఉండే మిగితా రోగుల ను వాకబు చేసింది.కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఆమె భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆసుపత్రి లో విచారణ చేస్తున్నామని వారు తెలిపారు.