HomeTelanganaNizamabadనేతల ప్రచారానికి బ్రేక్ ....కాసేపట్లో ముగిసిన ప్రచార గడువు .....ప్రలోభాలు షురూ ......కాంగ్రెస్ బీజేపీల అగ్రనేతల...

నేతల ప్రచారానికి బ్రేక్ ….కాసేపట్లో ముగిసిన ప్రచార గడువు …..ప్రలోభాలు షురూ ……కాంగ్రెస్ బీజేపీల అగ్రనేతల సందడి

పది రోజుల పాటు హోరెత్తిన నేతల ఎన్నికల ప్రచారానికి కాసేపట్లో బ్రేక్ పడబోతోంద. ప్రచారం ముగించిన నేతలు చివరి అస్రంగా ప్రలోభాలకు తెరలేప బోతున్నారు .

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అగ్ర నేతలను రంగంలోకి దించాయి కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రాగ పీసీసీ చీఫ్ మూడు రోజులుగా ఇక్కడే మకాం వేశారు బీజేపీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఎంపీ రఘు నందన్ రావు ప్రచారం లోసందడి చేశారు.

గత నెల 31వ తేదీ నుంచి అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వెంట ప్రచార రథాలతో మైకుల మోత మోగించి, ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హోరెత్తిన వార్డులు నేటి రాత్రితో నిశ్శబ్దంలోకి వెళ్లనున్నాయి.

నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రచారం ప్రారంభమైనప్పటికీ, నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అనంతరం ఒక్కసారిగా ఎన్నికల వాతావరణ వేడెక్కింది.

ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారుచేయడంతో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్ లు ఉన్నాయి. అందులో బీజేపీ నుంచి 58 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 60, బీఆర్ఎస్ నుంచి 58, ఎంఐఎం 21, స్వతంత్రులు 108 మంది, మొత్తం బరిలో 350 మంది అభ్యర్థులు ఉన్నారు.

వీరందరు వారం రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన ఎన్నికల ప్రచారం రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ఈ మేరకు మొన్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు విచ్చేసి అటు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో, కాంగ్రెస్ కార్యకర్తలలో జోష్ నింపారు.

అలాగే మున్సిపల్ ప్రజలకు హామీలు ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ లో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాయి.

ఇక ఈసారి ఎలాగైనా మేయర్ పీఠం గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యేలు మున్సిపల్ లోని అన్ని డివిజన్ లు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు మిగతా మూడు మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ కనిపించింది.

ఇక, గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలతో అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు. ప్రచారం ముగియడంతో, ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పోల్ మేనేజ్మెంట్ పై కేంద్రీకరించనున్నాయి. ఏ వార్డులో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో అన్న లెక్కలను అభ్యర్థులు ముందే సిద్ధం చేసుకుని, దాని ఆధారంగా తాయిలాల పంపిణీ వ్యూహాలు రూపొందిస్తున్నారు.

ఎదుటి పార్టీ అభ్యర్థి ఎంత ఇస్తున్నాడు.. మనం ఎంత ఇవ్వాలి.. ఎక్కడ పంపిణీ చేయాలి.. అనే లెక్కలతో పత్రాలు, జాబితాలు సిద్ధమయ్యాయి.

నేటి అర్ధరాత్రి నుంచి తొలి విడతగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు మొదలై, ఎన్నికలకు ముందు రాత్రి మరోసారి డబ్బు, గిఫ్టులను పంపిణీ చేయాలనే స్కెచ్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.ఎన్నికల షెడ్యూల్..పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026..ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 13, 2026..మేయర్ ఎన్నిక: ఫిబ్రవరి 16, 2026

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments