HomeTelanganakamareddyకారు అద్దాలు పగల్గొట్టి రూ. 8 లక్షల అపహరణ..బాన్సువాడలో దొంగల బీభత్సం

కారు అద్దాలు పగల్గొట్టి రూ. 8 లక్షల అపహరణ..బాన్సువాడలో దొంగల బీభత్సం

బాన్సువాడ పట్టణ కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. జనం రద్దీగా ఉండే ప్రాంతంలోనే అత్యంత సాహసంగా దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి మరీ, కారు అద్దాలు పగులగొట్టి రూ. 8 లక్షల భారీ మొత్తాన్ని అపహరించుకుపోయారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాధిత వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో రూ. 8 లక్షల నగదును డ్రా చేశారు. అనంతరం ఆ డబ్బును తన కారులో ఉంచి, వ్యక్తిగత పనుల నిమిత్తం పక్కనే ఉన్న రిలయన్స్ మార్ట్ లోపలికి వెళ్లారు.

ఇదే అదనుగా భావించిన ఇద్దరు దుండగులు కారు వద్దకు చేరుకున్నారు. క్షణాల వ్యవధిలోనే కారు అద్దాలను పగులగొట్టి, లోపల ఉన్న రూ. 8 లక్షల బ్యాగును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. తిరిగి వచ్చిన బాధితుడు కారు అద్దాలు పగిలి ఉండటం, లోపల నగదు మాయమవ్వడం గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రిలయన్స్ మార్ట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments