ఆర్మూర్ శివారులో అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్-తరలిస్తుండగా ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుఇది సంగతి ఆర్మూర్: వేగంగా వెళుతున్న కారును నిర్లక్ష్యంగా డ్రైవర్ నడపడంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఆర్మూర్ పట్టణ శివారులో నిజామాబాద్ రోడ్డులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో నరేష్ అనే 43 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు నరేష్ అతని స్నేహితుడు నాగేష్ లు ఆర్మూర్ లో పనులు ముగించుకొని తిరిగి నిజామాబాదు వైపు వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది.
వారు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన నరేష్, నాగేష్ లు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా నరేష్. మృతి చెందాడు.
కాగా నాగేష్ నరేష్ లు ఇద్దరు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామస్తులు అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రత్యక్ష సాక్షులు నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని చితకబాదారు.
పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
